Tips for improving the eyesight

కంటిచూపు మెరుగుకు చిట్కాలుఇలా చేస్తే మీ కళ్లకు రక్షణనిస్తునట్టే:



సింపుల్ టిప్స్‌ను నిత్యం పాటిస్తూ చ‌క్క‌ని నేత్ర దృష్టిని ఎలా పొంద‌వ‌చ్చో తెలుసుకుందాం..
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న జ‌నాభాలో నేడు అధిక శాతం మంది ఎదుర్కొంటున్న ప్ర‌ధాన అనారోగ్య స‌మ‌స్య‌ల్లో నేత్ర సంబంధ‌మైన‌వి కూడా ఎక్కువ‌గానే ఉంటున్నాయి. ఈ రోజుల్లో అప్పుడే పుట్టిన శిశువుల్లో కూడా ఈ స‌మ‌స్య ఎదుర‌వ‌డం స‌ర్వ సాధార‌ణ‌మైపోయింది. ఇక యువ‌త‌, పెద్ద‌ల్లో అధిక శాతం మంది చిన్న వ‌య‌స్సులోనే కంటి అద్దాలు, కాంట‌క్ట్ లెన్స్‌లు ధ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వారు నేత్ర సంర‌క్ష‌ణ‌పై దృష్టి సారించాల్సి వ‌స్తోంది. అయితే కింద ఇచ్చిన ప‌లు స‌హ‌జ సిద్ధ‌మైన టిప్స్‌ను పాటిస్తే నేత్ర సంబంధ స‌మ‌స్య ఏదైనా సుల‌భంగా దూర‌మ‌వుతుంది. ఆ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


(1) రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు వెంట‌నే దూర‌మ‌వుతాయి. క్యారెట్ల‌లో విట‌మిన్ ఎ, బీటా కెరోటిన్ వంటివి పుష్క‌లంగా ఉంటాయి. ఇవి నేత్ర సంబంధ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాయి. చూపు స్ప‌ష్ట‌త‌ను పెంచుతాయి.

(2) నేటి త‌రుణంలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూట‌ర్ల వాడ‌కం ఎక్కువైంది. దీనికి తోడు బ‌య‌ట తిర‌గ‌డం, ప‌ని ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటే ఆ ప్ర‌భావం క‌ళ్ల‌పై కూడా ప‌డుతుంది. రోజూ క‌నీసం 3 గంట‌ల పాటు క‌ళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకుంటే ఈ ఒత్తిడి నుంచి సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

(3)రోజులో కొంత స‌మయం పాటు ఆహ్లాద‌క‌ర‌మైన ప‌చ్చ‌ని ప్ర‌కృతిని చూడండి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ళ్ల‌కు ఎంత‌గానో హాయి క‌లుగుతుంది. ఇది నేత్రాల‌కు పూర్తి స్థాయిలో హాయినిస్తుంది.

(4) కంటి అద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌ల‌ను ఎక్కువ‌గ ధ‌రించే వారు రోజులో కొంత స‌మ‌యం పాటు వాటికి దూరంగా ఉండేందుకు య‌త్నించండి. దీని వ‌ల్ల లెన్స్‌ల ద్వారా క‌ళ్ల‌పై ప‌డే ఒత్తిడి త‌గ్గుతుంది.

(5) కంప్యూట‌ర్ల‌పై ఎక్కువ‌గా ప‌నిచేసేవారు అవ‌స‌ర‌మైతేనే వాటిని వాడాలి. లేదంటే దూరంగా ఉండాలి. వీలైనంత వ‌ర‌కు కంప్యూట‌ర్ స్క్రీన్ల నుంచి దూరంగా ఉండేందుకు య‌త్నించాలి.

(6) క‌ళ్ల‌ను నిత్యం కొంత సమ‌యం పాటు సున్నితంగా మ‌సాజ్ చేయాలి. ఇలా చేస్తే క‌ళ్ల‌కు విశ్రాంతి క‌లుగుతుంది. చిత్రంలో చూపిన విధంగా మ‌సాజ్ చేస్తే మ‌రింత ఫ‌లితం ఉంటుంది.

(7) రోజూ ఒక అరగంట పాటు గోరు వెచ్చ‌ని త‌డి గుడ్డ‌తో క‌ళ్ల‌ను సున్నితంగా ఒత్తిన‌ట్టు చేయాలి. ఇది క‌ళ్ల‌కు హాయినిస్తుంది.

(8) ఈ పోస్ట్ లో వున్నా రెండో ఫోటో కూడ ఓపెన్ చేయండి

*కంటి రెప్పులు వాపులకు గురైతే ఈ టిప్స్ను పాటించండి చాలు… సమస్య ఇట్టే తొలగిపోతుంది…

కంటికి సంబంధించిన సమస్యలంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది కంటి రెప్పల వాపు. అధిక శాతం మందికి తరచూ కంటి రెప్పలు వాయడం, వాటి నుంచి నీరు కారడం, మంట, దురద అనిపించడం జరుగుతూ ఉంటుంది. కొందరిలో ఉబ్బిన కంటి రెప్పల నుంచి చీము కారడం కూడా సంభవిస్తుంటుంది. అయితే ఈ అనారోగ్యానికి కారణం కేవలం బాక్టీరియా ఇన్ఫెక్షనే. అందువల్లే మన కళ్లు అప్పుడప్పుడు ఈ విధంగా వాస్తుంటాయి. కింద ఇచ్చిన టిప్స్ను పాటిస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. పచ్చి టమాటాను తీసుకుని దాన్ని అడ్డంగా చక్రాల్లా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన ముక్కలను వాపు ఉన్న ప్రదేశంపై 5 నిమిషాల పాటు ఉంచాలి. రోజుకు ఇలా 3 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. అంతేకాదు ఆ ప్రాంతంలో చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.
2. కంటి రెప్పలకు కలిగే వాపులను తొలగించడంలో కొత్తి మీర ఆకులు బాగా పనిచేస్తాయి. కొన్ని కొత్తిమీర ఆకులను తీసుకుని నీటిలో బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి సమస్య ఉన్న ప్రదేశంపై రాయాలి. రోజుకు ఇలా 3 సార్లు చేస్తే కంటి రెప్పల వాపులు తగ్గిపోతాయి.
3. కంటి సంబంధ సమస్యలను తొలగించడంలో కీరా దోస కూడా బాగానే ఉపయోగపడుతుంది. ఒక కీర దోస కాయను తీసుకుని దాన్ని చక్రాల్లా కోసి వాటిని కళ్లపై పెట్టుకుని 30 నిమిషాల పాటు ఉండాలి. రోజులో ఇలా 3 సార్లు చేస్తే కంటి రెప్పల వాపులు తగ్గిపోతాయి. కళ్లు సురక్షితంగా ఉంటాయి.
4. కొంత నీటిని తీసుకుని గోరు వెచ్చని స్థితి వచ్చే వరకు మరిగించాలి. అనంతరం ఆ నీటిలో ఒక కాటన్ గుడ్డను ముంచి సమస్య ఉన్న ప్రదేశంలో కాపడంలా పెట్టాలి. దీంతో కంటి వాపు తగ్గుతుంది.
5. మార్కెట్లో దొరికే చిన్నపాటి టీబ్యాగ్ను తీసుకోవాలి. దాన్ని వేడి నీటిలో ముంచి కంటి రెప్పపై రాయాలి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఇలా చేస్తే కంటి వాపు తగ్గుతుంది.
6. కంటి సమస్యలను తొలగించడంలో పసుపు బాగా ఉపకరిస్తుంది. దీంట్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఒక కప్పు నీటిని తీసుకుని దాంట్లో ఒక టీస్పూన్ పసుపు వేసి ఆ నీటిని సగం అయ్యే వరకు మరిగించాలి. ఐ డ్రాపర్ సహాయంతో ఆ ద్రవాన్ని కంటి రెప్పలపై రాయాలి. రోజులో ఇలా 2 , 3 సార్లు చేస్తే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
7. అలోవెరా జెల్ను కొద్దిగా తీసుకుని దాంట్లో కాటన్ బడ్ను ముంచాలి. అనంతరం ఆ బడ్ను కంటి రెప్పపై రాయాలి. ఇలా రోజుకు 3, 4 సార్లు చేయాలి. అలా చేసినప్పుడల్లా కళ్లను నీటితో కడగాలి. దీంతో కంటి రెప్పల వాపు తగ్గుతుంది.మి నవీన్ నడిమింటి  

Comments