Easy Steps for six pack

మీ పొట్ట పోయి సిక్స్ ప్యాక్స్ రావాలంటే సూర్య నమస్కారాలు చేయాలి.  

.ప్రతి నిత్యం చేసే వాళ్ళకు హర్ట్ ప్రాబ్లంలు రావు...

బరువు పెరిగిపోతున్నామని బెంగ పడుతున్నారు  పెరిగిన శరీరాన్ని తగ్గించుకోవడానికి ఫిట్‌నెస్‌ కేంద్రాల్లో నానా పాట్లు పడుతున్నారు. అయినా ‘భారం’గా ఫీలవుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి అన్ని కాలాల కంటే వేసవి ప్రకృతి ఇచ్చిన వరం లాంటిది. మారుతున్న జీవన విధానంలో నోటిని అదుపులో ఉంటుంచుకోలేకపోతున్నారు. కొత్తకొత్త వంటకాలు, సరికొత్త రుచులకు అలవాటు పడి శరీరాన్ని పెంచేసుకుంటున్నారు. ఆ తర్వాత దాన్ని తగ్గించుకోవడానికి ఎన్నో కుస్తీలు పడుతున్నారు. ఇలా అధిక బరువుతో బాధపడే వాళ్లంతా సమ్మర్‌ చిట్కాలతో దాన్ని తగ్గించుకోవచ్చు.


చన్నీటి స్నానం తర్వాత వ్యాయామం

తక్కువ బరువు ఉండి, చెమటను త్వరగా పీల్చే దుస్తులతో వ్యాయామం చేయడం మంచిది. వేసవిలో వర్క్‌ అవుట్స్‌, కష్టతరమైన యోగాసనాలు, సూర్య నమస్కా రాలు తక్కువ చేయడం ఉత్తమం. బరువు తగ్గాలనుకున్న వారికి స్విమ్మింగ్‌ మంచి వ్యాయామం. ఈత రాని వారికోసం ఆక్వా జుంబా, ఆక్వా యోగ అందుబాటులోకి వచ్చాయి. వర్క్‌అవుట్స్‌ చేయడానికి ముందే చన్నీటి స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగదు. వాకింగ్‌, జాగింగ్‌ వంటివి మినహాయిస్తే, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సూచనలతో వర్క్‌అవుట్లు చేయడం మంచిది.

ఆహారంతోపాటు శీతలి ప్రాణాయామం

వేసవిలో భానుడి ప్రతాపం ఉదయం ఏడు గంటల నుంచే మొదలవుతుంది. కత్తెర్లు మొదలైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఎండల తీవ్రతను తట్టుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువ తాగాలి. వీటితోపాటు శీతలి ప్రాణాయామం చేస్తే కొంత వరకు ఎండల ప్రతాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి అందుతుంది. బరువు తగ్గడానికీ ఉపయోగపడుతుంది. నాలుకను మడిచి, నోటి ద్వారా గాలి పీల్చి, ముక్కు ద్వారా వదిలే ప్రక్రియే శీతలి ప్రాణాయామం. ఉదయం ఏడు గంటలలోపు ఐదు నిమిషాలపాటు ఈ వ్యాయామం చేయడం మంచిదని యోగాసనాల్లో ప్రావీణ్యం ఉన్న వారు సూచిస్తున్నారు.

  మట్టి కుండ నీళ్లతో గొంతు తడుపుకుంటే...

మామూలు రోజుల కంటే, వేసవిలో మనిషి ఆకలిలో ఎక్కువ వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఎంతటి భోజన ప్రియులైనా వేసవి కాలంలో కాస్త మోతాదు తగ్గించి ఆహారం తీసుకుంటారు. వేసవిలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది. దాహం ఎక్కువ, ఆకలి తక్కువగా ఉంటుంది. 15 నుంచి 20 నిమిషాలకు ఒకసారి చొప్పున రోజుకు కనీసం ఏడు లీటర్లు తాగితే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఫ్రిజ్‌లో నీటికన్నా కుండలోని నీటిని తాగడం ఉత్తమం.

చిరాకును వదలండిలా..

వేసవిలో ప్రతి మనిషిలోనూ చిరాకు ఎక్కువగా కనిపిస్తుంది. చెమటకు, ఉక్కబోతకు చిన్న విషయానికే చిర్రుబుర్రులాడుతుంటారు. ఒక్కోసారి ఆ ప్రభావం ఎదుటి వారిపై చూపిస్తుంటారు. దీన్ని దూరం చేసుకోవడానికి చంద్రభేదన యోగాసనం ఉత్తమ మార్గమని యోగా నిపుణులు చెబుతున్నారు. కుడినాసికా రంధ్రాన్ని పూర్తిగా మూసేసి, ఎడమ నాసికా రంధ్రాన్ని సగం మూసి గాలి పీల్చి, రెండు నాసికా రంధ్రాల నుంచి వదలాలి.

ఈ ఆహారం తీసుకుంటే
 నీటి శాతం ఎక్కువగా ఉంటే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చ, కీర, కర్బూజ, తాటిముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు, లవణాలు అందుతాయి.  నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల కడుపు నిండినట్టుంటుంది. డైట్‌ కంట్రోల్‌ అవుతుంది.  శీతల పానియాలు, చక్కర వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే మాత్రం బరువుతగ్గకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆకలి తక్కువ.. దాహమెక్కువ వేసవిలో ఆకలి తక్కువగాను, దాహం ఎక్కువగాను ఉంటుంది. జీర్ణక్రియలోనూ తేడాలు వస్తుంటాయి. డైట్‌ పాటిస్తూ కాలానికి తగ్గట్టుగా ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలి. బరువు తగ్గించుకోవాలనుకునే వారికి వేసవి... ప్రకృతి ఇచ్చిన అవకాశం.

 యోగ సూర్య నమస్కారాలు: ఇలా చేయాలి, ఫలితాలు ఎన్నో
*Encourage your parents and senior citizens to practise  this ""Chair Suryanamaskara""  12 times daily. This will improve their overall health, reduce joint stiffness,  improve lung capacity, strengthen the knees and muscles, reduce age related issues such as acidity and gas etc. It's very mild but effective in a long run and very much sustainable. It's also practicable and beneficial for people with knee problems and those who find difficult to walk.

యోగాసనములు,ప్రాణాయనము కలిపి చేసేదే సూర్యనమస్కారం అంటారు.అసనాలు వేయడానికి ముందు సూర్యనమస్కారము చేయడం వలన శరీరానికి ఉత్తేజము కలిగి ఇతర అసనాలు వేయడానికి శరీరాన్ని తయారుచేస్తుంది.ఈ ఆసన సమయంలో ప్రాణ వాయువు కూడా ఎక్కువగా అందుతుంది.ఇవి మొత్తం "12" ఆసనాలతో కూడిన ఆవృత్తి. సూర్య నమస్కారాలలో ఒకదాని తర్వత ఒకటి వరుస క్రమంలో చేస్తాము.వీటిని 3 నుండి 12 సార్లు చేయవచ్చును.
యోగాసనాలు ఇలా చేయాలి
1) నమస్కార ముద్ర :-మొదట తూర్పు దిశ వైపు చాపమీద నిలబడి చేతులు రెందు చాతీకెదురుగా నమస్కార ముద్రలో ఉండవలెను.కాళ్ళు రెండు దగ్గరకు చేర్చి ఉంచవలెను.శ్వాస సాధరణంగా ఉంచవలెను.
2) హస్త ఉత్ధనాసనము :- శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకెత్తి కాళ్ళు వంచకుండా వెనకకు వంగవలెను.
3) పాదహస్తాసనము :- శ్వాస వదులుతూ,కాళ్లు వంచకుండా ముందుకు వంగి,చేతులు కాళ్ళు పక్కన నేలకు అనించవలెను.తలను మోకాళ్ళకు ఆనించవలెను.4) అశ్వసంచాలసనము :- శ్వాస తీసుకుంటూ ఎడమకాలిని వెనకకు చాచవలెను.కుడికాలుకు రెండు పక్కల చేతులు అనించి తలను నేరుగా ఉంచవలెను.
5 ) అశ్వ సంచలనాసనము :-
కుడి కాలు వెనకకు చాచుతూ రెండు కాళ్ళు ఒకచొటకిచేర్చి ఉంచవలెను.శరీరం భూమి మీద అనకుండా తల నుండి కాలు వరకు నిటారుగా ఉండవలెను.శ్వాస పొట్టలోనే అపుకోవాలి.
6) అష్టాంగ నమస్కారం :- శ్వాసను వదులుతూ చేతులు కదపకుండా నెమ్మదిగా శరీరాన్ని చాప మీదకు తీసుకుని వచ్చేటపుడు తల,ఛాతి,మోకాళ్ళు చాపకు తగిలేట్టుగా ఉందవలెను.పిరుదులు పైకెత్తి ఉంచవలెను.అష్టాంగములు (రెండు అరచేతులు,రెండు పాదములు,రెండు మోకాళ్ళు, ఛాతీ,నుదురు) మాత్రమే చాపను తాకవలెను.
7 ) భుజంగాసనము :-శ్వాస తీసుకుంటూ తల,ఛాతిని చాపమీద నుండి పైకి లేపవలెను.పొత్తి కడుపు చాప మీద ఉండవలెను.
8) అర్ధముక్తాసనము

:- శ్వాస నెమ్మదిగా వదులుతూ కాళ్ళు,చేతులు కదిలించకుండా నడుమును పైకెత్తి తలను నేల వైపుగా తీసుకు రావాలి.పాదాలు మాత్రం నేలకు తాకి స్థిరంగా ఉంచవలెను.శరీరాన్ని ఇంగ్లీష్ అక్షరం 'A' ఆకారంలో ఉంచవలెను.

9) అశ్వసంచాలసనము :-
శ్వాసను తీసుకుంటూ చేతులు కదపకుండా కుడి కాలును ముందుకు తీసుకునివచ్చి రెండు చేతుల మధ్యలో నుండి తల పైకెత్తవలెను.
10 పాదహస్తాసనము
:- శ్వాస వదులుతూ ఎడమకాలును కుడి కాలి పక్కన రెండు చేతుల మధ్యన చేర్చవలెను.నుదురు మోకాళ్ళకు తాకించాలి.రెండు చేతులు,రెండుకాళ్ళు నిటారుగా ఉండవలెను.
11) హస్తతానాసనము :- శ్వాస తీసుకుంటూ చేతులు తల పైకెత్తి నిటారుగా నిలబడి వెనుకకు శరీరం సహకరించింత వరకు వంగవలెను.
12) ప్రణామాసనము (నమస్కారముద్ర) :- నిటారుగా నిలబడి రెండు చేతులు ఛాతీకెదురుగా నమస్కారముద్రలో ఉంచవలెను.రెండవ సారి సూర్యనమస్కారం చేసేటప్పుడు కాళ్ళు భంగిమలో ఎడమ కాలుకు బదులు కుడి కాలును ఉపయోగించవలెను. మి నవీన్ నడిమింటి సూర్యనమస్కారాల వలన లాభాలు

* ఈ సంపూర్ణమైన వ్యాయామం వలన శరీర భాగములన్నింటిని పుష్టిగా ఉంచి అనారోగ్యం పోగోట్టును.* కడుపు,జీర్ణాశయము,హృదయము,చిన్నప్రేగులు,కాలేయంములను ధృడపరచును.* వెన్నుపాము,నడుములోని ఎముకలను సడలించును.రక్తప్రసరణను సరిదిద్దుట వలన రక్తములోని మలినములను పోగోట్టును.చర్మవ్యాధులను నయం చేయును.* చేతులు,భుజములు,కాళ్ళు,తోడల కండరములు,మెడ ఎముకలను గట్టిపరచును.* మనశ్శాంతి,మనాసిక ధృడత్వం ఏర్పడును.* డయోబెటిస్ ను నియంత్రించును.* పరిపూర్ణమైన ఆరోగ్యమును సమకూర్చును.
12 ఆసనాలు వేయడం వల్ల
శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను సహజ సిద్ధంగా తొలగించగల ప్రక్రియలివి . హార్మోనుల అసమతుల్యాన్ని సవరించడం వీటి వల్ల వచ్చే అదనపు ప్రయోజనం.పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలో బిగువులు తొలగడం, విషపదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులువు కావడం, కీళ్ళు వదులవడం జరిగి నరాల కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేస్తుంది.

దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి.అంతే కాక వ్యాధి నిరోధక శక్తి హెచ్చి శరీరం తేలికగాను, తేజోవంతంగాను, శక్తివంతంగాను తయారవుతుంది.దేహంలోని వ్యవస్థలన్నీ మెరుగుపడి మలినరహితమై శక్తివంతమవుతాయి.

Comments