Common cold and immediate relief

" జలుబు"  (common cold) గురించి పూర్తిగా తెలుసుకుందాం !
వాతావరణంలో మార్పు చోటుచేసుకొ


న్నప్పుడల్లా ముక్కు మొరాయస్తుంది. పడిశం పట్టి పీడిస్తుంది. జలుబు చేస్తున్నట్టు అనీ అనిపించగానే తుమ్ములు, ముక్కునుంచి నీళ్లు కారడం లాంటివి బయటపడతాయి. జలుబు చేయగానే తలనుంచి పాదం దాకా అన్ని అవయాలు నొప్పి అనిపించి గాలి ఆడకుండా ముక్కు దిబ్బడి వేసినట్టుగా ఉంటుంది.
జీవితంలో ఎప్పుడో ఒకసారి జలుబు బారినపడని మనిషంటూ ఎవరూ ఉండరు. చిన్న పిల్లలనుంచి వృద్ధుల దాకా ప్రతివారూ ఎప్పుడో ఒకప్పుడు జలుబుబారిన పడుతుంటారు. జలుబు మనిషికి ఎంతటి సహజమైనదో, అంతటి సర్వసాధారణమైనది. సగటున మనిషి ఏడాదికి 3 - 4 సార్లు అయినా జలుబుతో బాధపడుతుంటాడని అంచనా. జలుబు రావడానికి కనీసం 200 పైచిలుకు వైరస్‌లు కారణంగా ఉంటాయి. మనిషినుంచి మనిషికి మారుతున్న కొద్దీ ఈ వైరస్‌ల జన్యు నిర్మాణం మారిపోతుంటుంది. అంటే భార్యాభర్తలలో ఒకరినుంచి మరొకరికి జలుబు అంటుకుంటే, ఆ ఇద్దరి జలుబు ఒకటి కాదన్నమాట. అయితే, ముక్కు చీదడం, తుమ్మడం, దగ్గడం వంటి లక్షణాలు మాత్రం ఇద్దరిలోనూ ఒకే విధంగా ఉంటాయి.
అపోహలు #  వర్షంలో తడిస్తేజలుబు చేస్తుందని చాలామంది భావిస్తారు. వర్షంలో తడిసినంత మాత్రం చేత జలుబు చేయదు. నిజానికి జలుబు ఇంటిలోపలే అంటుకుంటుంది. జలుబు వైరస్‌లు మాయిస్ట్‌ హీట్‌లో వృద్ధి చెందుతాయి. అంటే... వర్షాకాలంలో వర్షం కురుస్తున్నప్పుడు , చలికాలములో మంచు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇంటి లోపలే ఉంటాము. గదిలోపలి చెమ్మగిల్లిన వేడి వాతావరణంలో వైరస్‌ వలన జలుబు చేస్తుంది. ముక్కు కారడం తో మొదలై తలనొప్పి , జ్వరము , దగ్గు , ఒళ్లునొప్పులు, తలబరువుగా ఉండడం వంటి లక్షణాలు కలుగుతాయి . ఒక వేళ వచ్చినా మందులు వాడినా వాడకపోయినా ఒక వారము రోజులలో తగ్గుముఖం పడుతుంది . ఈ జలుబునే ఎలర్జీ జలుబు అంటాము. కాని కొన్ని వైరస్ క్రిముల వల్ల వచ్చే జలుబు అయితే మాత్రం డాక్టర్ ని సంప్రదించాల్సిందే .
టిప్స్ #  1 . వ్యాపించే విధానము : సాధారణ జలుబు ఒకరి నుండి మరొకరికి స్పర్శద్వారా , గాలిద్వారా , వస్తువుల ద్వారా వ్యాప్తిచెండుతుంది . చేయిగాని , కర్చీప్ గాని తుమ్మ , దగ్గు వచ్చినపుడు అడ్డం గా పెట్టుకోవాలి . 2. జలుబు క్రిములు తుమ్మినా , దగ్గినా చుట్టుప్రక్కల ఉన్నా వస్తువులపై పడి ఇతరులకు వ్యాప్తిచెందుతాయి కావున చేతులు సబ్బుతో శుభ్రం గా కడుగుకోవాలి . ౩ . జలుబు ఉన్నపుడు నోరు పాడవుతుంది , జ్వరం వస్తుంది కావున ఎంతోకొంత డీహైడ్రేషన్ వస్తుంది . నీరు ఎక్కువగా త్రాగాలి ... సుమారు 1.5 నుండి 2 లీటర్ల నీటిని త్రాగాలి . నీరు తాగడానికి ఇష్టం లేనపుడు ఏ ద్రవ రూపములోనైనా నీరు తీసుకోవచ్చును . 4. జలుబు వల్ల కలిగే నీరసము పోవడానికి మంచి ఆహారము తీసుకోవాలి . వేడి పదార్ధాలు తినాలి . తేలికగా జీర్ణం అయ్యే ఆహారము నే తీసుకోవాలి . ఉడికించిన కూరలు , పాలు , రోగనిరోధక శక్తిని పెంచే నిమ్మజాతి పదార్ధాలు తిననాలి . 5. . జలుబు ఉన్న వారు బాగా అలిసిపోయే పనులు చేయకూడదు ... అలాగని ముసుగుతన్ని పడుకోకూడదు . మామూలు గానే తిరగాలి . చురుకుదనం వల్ల శరీరము లోని రోగనిరోధక శక్తి మెరుగు పడుగుంది . 6 . జలుబు ఉన్నవారు వేడినీరు స్నానం చేయండి . తలస్నానం చేయకూడదు . వేడినీరు స్నానం శరీర రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది . 7 . జలుబుకి వాడే ఆయింట్ మెంట్లు ముక్కు కు రాయవచ్చును , వేడినీటిలో anticold liniments వేసి ఆవిరిపీల్చడం మంచిది . 8 . మత్తుపానీయాలు తీసుకోకూడదు . పొగ తాగకూడదు . ఐస్ క్రీములు , చల్లని కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు 9 . గొంతు నొప్పి ఉంటే జలుబు లేపనములు (ointments) గొంతు పైన రాయవచ్చును . వేడి కాఫీ , టీ , పాలు తీసుకుంటే గొంతులో గురగుర తగ్గుతుంది .
జలుబు పెట్టే నరకయాతనతో భరించేదెలా... ? . అయితే జలుబు లాంటి కారణాలకు కూడా అదేపనిగా మందులు మింగుతూ కూర్చుంటే ఎలా... ? అని ప్రశ్నించేవారికోసం ఇవిగో కొన్ని చిట్కాలు...
వేడి పాలల్లో చిటెకెడు పసుపు కలుపుకుని తాగితే జలుబు వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి - ఉదయాన్నే వేడి పాలల్లో మిరియాల పొడి, కాస్త శొంఠి పొడి కలుపుకుని వేడిగా తాగితే జలుబు బాధల నుంచి చక్కని ఉపశమనం లభిస్తుంది - ఓ గిన్నెలో వేడి నీరు పోసి అందులో పసుపు కాస్త జంఢూబామ్ వేసుకుని ఆవిరిపడితే జలుబు వల్ల మూసుకుపోయిన ముక్కు వెంటనే తెర్చుకుంటుంది. - వీటితో పాటు తులసి, అల్లం రసాన్ని తేనెతో కలిపి సేవిస్తే జలుబు తీవ్రత వెంటనే తగ్గుతుంది. - ఓ గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, రెండు చెంచాల తేనె కలిపి రోజు పరగడుపున తాగితే జలుబు తగ్గుతుంది.
ఇలా పైన చెప్పిన చిట్కాల్లో అవసరమైన వాటిని పాటిస్తే జలుబు తీవ్రత ఓ నాలుగైదు రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ వారం పదిరోజులు దాటినా జలుబు తీవ్రత తగ్గకుంటే వైద్యుని సమక్షంలో పరీక్షలు చేసుకోవడం మంచిది.
మీరు గమనించారో లేదో కాని.... పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నప్పుడు లేదా ఏవైనా తీవ్ర ఇబ్బందులలో ఉన్నప్పుడు ఎక్కువగా జలుబు చేస్తుంటుంది. మానసిక వత్తిళ్లు మనలో రోగ నిరోధక శక్తిని దెబ్బ తీయటం అందుకు కారణం. మంచినీరు, టీ, పళ్ల రసాలు మొదలైన ద్రవ పదార్థాలు పుష్కలంగా లోపలికి తీసుకుంటే మనం జలుబుకు దూరంగా ఉంటామని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. జలుబు చేసినప్పుడు కొవ్వు గల ఆహార పదార్థాలు, మాంసం, పాల ఉత్పత్తులను తక్కువగా తీసుకోండి. తాజా పళ్ల రసాలు, కాయగూరలను ఎక్కువగా తీసుకోండి. పొగ తాగడం వల్ల గొంతు మండుతుంది. జలుబు ఆ మంటను మరింత పెంచుతుంది. ముక్కులోపల ఉండే సిలియా అనే చిరు వెంట్రుకల లైనింగ్‌ ముక్కులోనికి ప్రవేశించే బాక్టీరియా గొంతులోకీ, ఊపిరితిత్తులకూ పోకుండా అడ్డుకుంటుంది. ఇన్‌ఫెక్షన్‌తో పోరాటం జరిపే సిలియా చర్యలను పొగతాగడం నిరోధిస్తుంది. కనుక జలుబు రోజులలోనైనా పొగ తాగడాన్ని తగ్గించడం లేదా మానుకోవడం మంచిది. జలుబుతో బాధపడుతున్నప్పుడు ఉదయాన, మధ్యాహ్నం, సాయంత్రం ఉప్పునీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల కొంత రిలీఫ్‌ లభిస్తుంది. ఒక గిన్నెలో బాగా మరుగుతున్న నీటిని తీసుకుని అందులో కొంత విక్స్‌ను కాని, అమృతాంజన్‌ను కాని కలిపి తల మీద దుప్పటి కప్పుకుని ఆ ఆవిరిని గాఢంగా ముక్కుద్వారా లోపలికి పీల్చుకోవడం వల్ల జలుబు తాలూకు ముక్కు దిబ్బడ, దగ్గు తగ్గుతాయి. పెద్ద గిన్నెలో మరిగించిన నీరు తీసుకుని మధ్యకు కోసిన రెండు ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఈ నీళ్లతో కనీసం పదిహేను నిమిషాలు ఆవిరిపట్టండి. జలుబుతో మూసుకుపోయిన ముక్కు నుంచి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది. జలుబు ఉన్నా లేకపోయినా సరే.. వారానికోసారి యూకలిప్టస్‌ నూనె వేసిన నీటితో ఆవిరిపట్టండి. దీనివల్ల శ్వాససంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. తులసి, మిరియాలతో చేసే కషాయం జలుబు సమస్యను అదుపులో ఉంచుతుంది. జలుబు, ముక్కుదిబ్బడ ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా యూకలిప్టస్‌ నూనెను రుమాలుపై వేసుకుని వాసన పీల్చితే మార్పు ఉంటుంది.
జలుబును నివారించాలంటే అదేపనిగా మందులు వేసుకోవడం కాదు.. ఇలాంటి చిట్కాలు పాటించి చూడండి

Comments