For Face fairness and pimple

మొటిమలు మరియు ముఖ సౌందర్యానికి

1కొత్తిమీర ఆకులు రసము నందు పసుపు కలిపి ము

ఖానికి ప్రతిరోజు రాత్రి రాసి ఉదయం కడిగేసిన మొటిమలు నివారించబడుతాయి.
ఇవి 20 -25 రోజులు చేయాలి.
దీనివలన ముఖ వర్చస్సు కూడా పెరుగుతుంది ముఖం ఎండిపోయినట్లు ఉండడం తగ్గుతుంది.
2. బంతి ఆకులు మెత్తగానూరి,రాత్రి మొటిమలపైరాసిఉదయం ముఖము కడిగి వేసిన మొటిమలు తగ్గిపోతాయి.
3. చేమంతి ఆకులను మెత్తగా నూరి రాత్రి మొటిమలపై రాసి ఉదయం ముఖం కడుక్కోవాలి.
4. స్రీలకు , మలబద్దక సమస్య ఉన్న లేదా బహిష్టు నెల సరిగా రాక పోయినా ముఖం మీద మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ రెండు సమస్యలు ఏవైనా ఉంటే ముందు వాటికి చికిత్స చేసుకోండి. కొందరికి యుక్త  వయసులో(14-25) మొటిమలు రావడానికి కూడా సహజమే.

Comments