మెడ పట్టేసింది అని బాధ పడుతూఉన్నారా ...!
అబ్బా మెడ పట్టేసింది... అయ్యో మెడ నొప్పీ... అంటుంటారు కొందరు. ముఖ్యంగా ఉద్యోగినుల్లో
ఇది సహజం.
దీన్ని తగ్గించాలంటే... తక్కువ సమయంలోనే చేసే *
ఈ ఆసనాలు ఎంచుకుని చూడండి. చాలన క్రియలుగా చెప్పుకునే వీటిని చేయడం వల్ల మెడ నొప్పీ, స్పాండిలైటిస్ తగ్గుముఖం పడతాయి*.
మీరు మెడనొప్పితో బాధ పడుతూ ఉంటె మీరు చెయ్యవలసిన మొదటి పని తలను ముందుకు వంచకుండా ఉండడం . మీరు తల ఎత్తుకుని తిరగడం మొదలు పెట్టండి . మీరు పడుకునేటపుడు తల దిండుకు బదులు గుండ్రంగా చుట్టిన దుప్పటి గాని , టవల్ గాని మెడ క్రింద పెట్టుకోండి . స్మార్ట్ ఫోన్ లో వాట్సప్ మెస్సేజ్ లు చూడడం కూర్చుని కాకుండా బోర్లా పడుకుని చూడండి . మీ తలను ముందుకు వంచడం మానండి .
మీరు చెయ్యవలసిన పనులు
1. మీ మెడను కుడి ఎడమ పైకి మాత్రమె గాలిని పీలుస్తూ తిప్పండి . వదులుతూ మామూలు స్థితికి రండి
2. మీ రెండు చేతులనూ ముందుకు చాపి వేళ్ళను మాత్రమె ముడిచి తెరుస్తూ ఉండండి . ముదిచినపుడు వెళ్ళు కణుపులు వరకూ మాత్రమే ముయ్యాలి . తెరిచినపుడు వేళ్ళ మధ్య ఖాళీలు ఎక్కువ ఉండేటట్టు తెరవాలి . ఊపిరిని పీలుస్తూ తెరవండి . విడుస్తూ ముయ్యండి .
3. తరువాత మీ చేతి బొటన వేళ్ళను లోపలి పెట్టి దానిపై మిగిలిన వేళ్ళతో వత్తిడి కలగ చేస్తూ గుప్పిళ్ళను ముయ్యాలి . ( ఊపిరి వదులుతూ ) ఊపిరి పీలుస్తూ గుప్పిళ్ళను తెరవాలి .
4. మీ చేతులను షోల్డర్ లెవెల్ కి చాపి ఉంచి మోచేతి వద్ద మడుస్తూ అరచేతులు భుజాల వద్ద పెట్టాలి మళ్ళీ చేతులను చాపాలి . ఇలా చెయ్యడం వలన మీ మోచేతి జాయింట్ ఫ్లెక్సిబుల్ గా తయారవడమే కాదు . మీ దండలు గట్టిపడతాయి . చేతుల లోకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది . స్పొండిలోసిస్ వలన కలిగే మొద్దుబారడం తగ్గుతుంది
5 చేతి వేళ్ళను దగ్గరగా చేర్చి , భుజాలపై పెట్టుకుని మోచేతులతో పెద్ద సున్నాలు చుట్టండి . వెనుకకు వెళ్ళేటపుడు బాగా దూరం గా ఉండేలా , ముందుకు వచ్చినపుడు చాతీ దగ్గర మోతేతులు కలిసిపోఎలా ఈ సున్నాలు చుట్టాలి .
5 మీ అర చేతులను మోకాళ్ళపై పెట్టుకుని , భుజాలను గుండ్రంగా ముందుకు సున్నాలు చుట్టండి . తరువాత వెనుకకు చుట్టండి . ఇది భుజాల నొప్పులను పోగొడుతుంది .
6 మీ రెండు చేతులనూ పైకి ఎత్తి , కుడి చేత్తో ఎడమ చేయి మణికట్టు వద్ద ఎడమ చేత్హో కుడి మణికట్టు వద్ద పట్టుకుని , చేతులను తల వెనుక వైపుకు తీసుకు వెళ్లి , ఎడమ చేతిని దిగువకు లాగుతూ , కుడి మోచేయి తల పై భాగం లోకి వచ్చేలా చేసి తలతో చేతులను వెనుకకు గెంటండి. ఇపుడు మీకు మెడ లో నొప్పి వస్తుంది . ఇది ఫ్రోజెన్ షోల్డర్ కి కూడా బాగా పనిచేస్తుంది . రివర్స్ లో కూడా చెయ్యండి .
7 అరచేతి వేళ్ళను ఇంటర్ లాక్ చేసి , తల వెనుక గా పెట్టి చేతులతో తలను ముందుకు నెడుతూ తలతో చేతులను వెనుకకు నేట్టండి . చేతులతో తలను వెనుకకు నేట్టండి . దీనివలన తలలో మెడ వెన్నుపూసలలో ఒక విధమైన వైబ్రేషన్ కలుగుతుంది . అలా చెయ్యడం వలన మెడలోని సి 1 నుండి సి 7 వరకూ ఉండే పూసల మధ్య గేప్ పెరుగుతుంది . ఇపుడు చేతులను ముందు నుదురు మీద పెట్టి , వెనుకకు ప్రెషర్ ఇవ్వండి . అలాగే ఎడమ చేతిని ఎడం వైపు కణత మీద పెట్టి కుడి వైపుకు ప్రెషర్ ఇవ్వండి . అనంతరం కుడి చేతిని కుడి కణత మీద పెట్టి ఎడమ చేతి వేపు గెంటండి . తలతో రెసిస్ట్ చెయ్యండి .
8 మీరు ఊపిరి పీలుస్తూ తలను కుడి వైపుకు తిప్పి గడ్డం ( కుడి భుజాన్ని తాకేలా ) ఊపిరి విడుస్తూ ముందుకు తీసుకు రండి . మీరు ఎంత తిప్పగాలిగితే అంత తిప్పండి . అలాగే ఎడమ వైపుకు కూడా చెయ్యండి . పైకి కూడా చెయ్యండి . కానీ క్రిందకు చెయ్యకండి .
9 కళ్ళను గుండ్రం గా తిప్పండి . పైకి , కుడికీ , దిగువకూ , ఎడమ వైపుకూ ......... తిరిగి రివర్స్ లో తిప్పండి .
ఈ సూక్ష్మ వ్యాయామాలు మీ మెడ నొప్పిని తగ్గించడం లో చాలా ప్రయోజనకరాలు . వీటిని మీరు ఎప్పుడైనా చెయ్యవచ్చు . ఖాళీ కడుపుతో చెయ్యాలని నియమం ఏమీ లేదు .
ఒక అద్భుతమైన ప్రక్రియ
మీరు మంచం పై అడ్డంగా వెల్లకిలా పడుకోండి , లేదా బల్లపై పడుకోండి . భుజాలు మంచం చివరకు /బల్ల చివరకు వచ్చేలా పడుకోవాలి . అపుడు మీ మెడ తల వెనుకకు వంగి ఉండాలి . అలా రోజులో కనీసం మూడు నాలుగు సార్లు చెయ్యండి . ఇది మీ మెడ ఎముకలలోని అసంబద్ధతను తొలగించడం లో చాలా
ఉపకరిస్తుంది .
మీకు కుదిరితే రోజుకు రెండుసార్లు లేదా రాత్రి పడుకునేముందు ఇలా పడుకుని రెండు ముక్కు రంద్రాలలోనూ 5 చుక్కలు చొప్పున దేశీయ ఆవునెయ్యి వెయ్యండి . మీరు ఆ నెయ్యిని ఎగపీల్చ వద్దు . దాని అంతట అది లోపలి వెళ్ళనివ్వండి . ఇలా మీరు చేసే ఈ ప్రరియ వలన మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి . అందులో మీకునిద్ర బాగా పట్టడం , మీ మెడ ఎముకల మధ్య ఉన్న ప్రెషర్ తొలగి మీకు ఉపశమనం కలిగిస్తుంది .
ఇంకొన్ని గృహ ఉపచారాలు :
1 . పసుపు , మెంతులు , శొంటి , సమాన పాళ్ళల్లో పౌడర్లు తీసుకుని ఒక గాజు సీసాలో ( లేకపోతే ఒక గాలి చొరబడని డబ్బాలో ) పెట్టుకుని ఉదయం సాయంత్రం ఖాళీ కడుపుతో ఉన్నపుడు అరగ్లాసుడు వేడి నీళ్ళల్లో ఒక గ్రాము పౌడర్ వేసుకున్ చెంచాతో కలిపి తాగండి . అది మీ నొప్పిని హరిస్తుంది .
2, రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసుడు పాలల్లో ఒక స్పూన్ పసుపు ( 1 లేదా 2 గ్రాములు ) వేసుకుని తాగండి .
3. ఒక చెంచాడు మెంతులు రాత్రి ఒక గ్లాసుడు నీళ్ళల్లో నాన బెట్టుకుని ఉదయం ఆ నీరు తాగి , ఆ మెంతులు నమిలి నమిలి తినండి . ఇది షుగరుకి కూడా పని చేస్తుంది . వేడి చేస్తుంది నాకు అనుకునే వారు మధ్యాహ్నం కొంచెం మజ్జిగ కాని , బార్లీ గానీ తాగండి .
4. వెల్లుల్లి పాయలను రెండు గాని మూడు గాని తీసుకుని , రాత్రి చిన్న చిన్న ముక్కలు చేసి కొంచెం నీళ్ళల్లో నాన బెట్టండి . ఉదయం ఆ నీరు తాగి ఆ వెల్లుల్లి ముక్కలు తినేయ్యండి . దీని వలన నొప్పి తగ్గుతుంది . అంతే కాదు మీ కొలెస్టరాల్ కూడా తగ్గుతుంది . గుందేకూ ఇది మంచిది .
5, అలూ వీరా జ్యూస్ తాగండి
6. గోధన్ ఆర్క్ తాగండి
7. నీళ్ళు వేడివి తాగండి
ఆక్యు ప్రెషర్ :
మీ చేతి బొటన వేలు , చూపుడు వేలు మధ్య భాగం లో ఉండే చర్మం మీద మీ రెండో చేతి బొటన వేలు చూపుడు వేళ్ళతో గట్ట్టిగా వత్తిడి కలిగించండి . ఆ భాగం లో నొప్పి వస్తుంది . అక్కడ నొప్పి ఉండి అంటే మీ వెన్నుపూసలో తేడా ఉండి అని అర్ధం చేసుకోండి . మీరు ఖాళీ కడుపుతో ఉన్నపుడు లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత ఈ పని చెయ్యండి . ఇది తక్షణమే మీకు పహ్లితం ఇస్తుంది . మీకు మీరు చేసుకోవడం కన్నా మీ దగ్గర వారి చేత చేయించుకుంటే బాగుంటుంది . వారికి మీమీద ఎక్కువ ప్రేమ ఉండాలి . మీరు నొప్పి నొప్పి అంటున్నా చెయ్యగలిగే వారు అయి ఉండాలి . లేదంటే నా కెందుకులే అనుకునే వారయినా నొప్పి భరించలేను అనుకుంటూ సున్నితంగా చేసుకున్నా ఫలితం తక్కువ ఉంటుంది

Comments
Post a Comment