How to fit body thru food

పొట్ట ఫ్లాట్ గా బాడీ ఫిట్ గా అట్రాక్టివ్ గా ఉండాలంటే ఈ ఫుడ్స్ తినండి

మన శరీరం ఎప్పుడూ ఒకే లాగ ఉండదు. వయ స్సు పెరిగే కొ
ద్ది శరీరంలో, చర్మంలో మార్పులు జరగడం సహాజం మద్యవయస్సు రాగానే అందమైన, ఫ్లాట్ టమ్మీని పొందడం చాలా కష్టం. అయితే కొన్ని ఆహారాలు ఫ్లాట్ టమ్మీని పొందడానికి సహాయపడుతాయి. ఇవి మనం రెగ్యులర్ గా తినే కామన్ ఫుడ్సే అయినా, ఆ విషయం చాలా మందికి తెలియదు. ఈ నార్మల్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హెల్తీ అండ్ టోన్డ్ స్కిన్ పొందవచ్చు..! అటువంటి టోన్డ్ అండ్ ఫ్లాట్ టమ్మీని కలిగి ఉంటం కష్టమే. ఎందుకంటే చిరుబొజ్జతో పొట్ట చుట్టూ నల్లగా ఉంటారు. అయితే ప్రతి ఒక్కరూ టోన్డ్, ఫ్లాట్ గా ఉండే టమ్మీతో ఫిట్ గా అట్రాక్టివ్ గా కనిపించాలని కోరుకుంటారు. ఆరోగ్యంగా, ఫిట్ గా అట్రాక్టివ్ గా ఉండటానికి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్లాట్ పొట్ట ఉన్నవారు హెల్తీగా ఉంటారని, హెల్తీ లైఫ్ స్టైల్ ను ఫాలో అవుతారని అంటారు. పొట్ట చుట్టూ ఎక్సెస్ ఫ్యాట్ చేరడం వల్ల వివిధ రకాల డిజార్డర్స్ ను ఎదుర్కోవల్సి వస్తుంది. హైకొలెస్ట్రాల్ లెవల్స్, డయాబెటిస్, కార్డియో వాస్క్యులర్ వ్యాధులకు లోనవుతారు. అందువల్ల అధిక పొట్ట, అధిక కొవ్వుతో లేని పోని జబ్బులను తెచ్చుకోవడం కంటే ఫ్లాట్ గా ఉండే టమ్మీని కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి, అందానికి మంచిది. శరీరం ఫిట్ గా, ఆకర్షణీయంగా ఉండాలంటే కొన్ని కామన్ ఫుడ్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

గుడ్డు: గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్స్ ఉంటుంది. అంటే కేవలం 70 క్యాలరీలు, కాబట్టి రెగ్యులర్ డైట్ లో ఎగ్ చేర్చుకుంటే మజిల్ మాస్ పెరుగుతుంది. టమ్మీ ప్లాట్ గా మారుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ : ఆపిల్ సైడర్ వెనిగర్ బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఆకలి కోరికలను తగ్గిస్తుంది.

ఆలివ్ ఆయిల్ : మరో ఆహారం బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి ఆలివ్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఫ్యాట్ సెల్స్ ను బర్న్ చేస్తుంది. వీటిలో క్యాలరీలు చాలా తక్కువ.

పెరుగు: పెరుగు ఎక్సలెంట్ ప్రోబయోటిక్, ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి . ఇది మజిల్ మాస్ ను బిల్డ్ చేస్తుంది. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది, టోన్డ్ స్కిన్ పెంచుతుంది.

లెమన్: నిమ్మరసంలో అసిడిక్ నేచర్ అధికంగా ఉంటుంది. ఇది పొట్టను శుభ్రం చేస్తుంది. పొట్టచుట్టూ ఫ్యాట్ సెల్స్ మరియు వ్యర్థాలు చేరకుండా నివారించడం వల్ల టమ్మీ ఫ్లాట్ గా కనబడుతుంది.

గుమ్మడి: పొట్ట ఫ్లాట్ గా ఉండాలని కోరుకునే వారు రెగ్యులర్ డైట్ లో ప్రోటీన్స్ ఉన్న ఆహారాలను చేర్చుకోవాలి. ఇది పొట్టను చాలా వేగంగా కరిగిస్తుంది.

కోకనట్ : ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే కొబ్బరి , కొబ్బరి పాలు పొట్టను చాలా వేగంగా కరిగిస్తాయి. అనారోగ్యకరమైన క్యాలరీలను కరిగిస్తాయి. బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తాయి.

Comments