కేశ సంరక్షణకు సలహాలు
1. తల స్నానం వీలైనన్ని సార్లు ఎక్కువ సార్లు చేస్తూ జుట్టు ని శుభ్రంగా ఉంచుకోవాలి .
2. వారానికి రెండు సార్లు అయిన తల నూనెతో మర్ధన చేసుకోవాలి.
3.వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరికాయ రసం, నువ్వుల నూనె సమపాళ్ళలో కలిపి, కాచి తలకు రాసుకోవాలి.
4.ఎక్కువగా జుట్టు రాలుతుంటే ఒక ఉల్లిపాయను మెత్తగా పేస్టులా చేసుకోని దానికి చెంచాడు తేనె కలపాలి. తలకు పట్టించి గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
5. జింక్, అత్యవసర ఫాటీ ఆమ్లాలను కలిగిన గుమ్మడికాయ గింజలు, వేరుశనగలు, కూరగాయ నూనెలు చుండ్రుని తరిమికొడతాయి.
6. రోజూ రెండు లీటర్ల కంటే ఎక్కువ నీరు తాగటానికి ప్రయత్నించండి.
7. దువ్వెనలను ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా, నీట్‌గా ఉంచుకోండి. వీలయితే మీ దువ్వెన సెపరేట్‌గా ఉంచుకోండి. రెగ్యులర్‌గా హెయిర్‌ను బ్రష్ చేసుకోండి.
8. రెండు టీ స్పూన్లు వెనిగర్ తీసుకోండి. దాన్ని ఆరు టీస్పూన్ల వాటర్‌లో కలపండి. రాత్రి నిద్రబోయే ముందు తలకి అనగా నెత్తిమీద చర్మానికి రాయండి. ఆపైన తలంతా కవర్ అయ్యేలా కప్పి ఉంచుకోండి. ఉదయాన్నే తలను వాష్ చేసుకోండి. షాంపూతో స్నానం అయ్యాక వెనిగర్ నీళ్లతో మరోసారి వాష్ చేసుకోండి. ఇలా నెలకి నాలుగుసార్లు చేయండి
9. ఒక టీస్పూన్ నిమ్మపండు రసాన్ని రెండు టీస్పూన్ల వెనిగర్‌ని కలపండి. దానితో తలని మసాజ్ చేసుకోండి. పది చేతివేళ్లు జుట్టు మధ్యలో నుంచి తలపై నున్న చర్మానికి అంటు కునేలా చేతివేళ్ల చర్మంతో మసాజ్ చేసుకోండి. ఆ తర్వాత ఎగ్‌షాంపూతో తలస్నానం చేయండి.
10. ఆల్మండ్ నూనె టీస్పూన్, సల్ఫర్ పొడి ఒక టీస్పూన్, స్పిరిట్ రెండు టీస్పూన్లు, నాలుగు టీ స్పూన్ల నీరు లేదా రోజ్‌వాటర్ తీసుకుని కలపండి. కలిపిన దానితో తలమీద మసాజ్ చేసుకోండి.
11. ఆల్మండ్ నూనెతో తలను బాగా మసాజ్ చేసుకుని వేడినీటిలో టవల్‌ను ముంచి, దాన్ని నీరు కాకుండా లైట్‌గా పిండి, టవల్‌ను తలకు చుట్టుకోండి. ఓ అరగంట అలాగే ఉంచండి.
12. ఆమ్లా, రీత, శీకాకా§్‌ు వందేసి గ్రాములు తీసుకుని రెండు లీటర్ల నీటిలో కలిపి వేడిచేయండి. దాదాపు సగం నీరు ఆవిరయ్యేం తవరకూ వేడిచేయాలి. షాంపులా దాన్ని ఉపయోగించటం ద్వారా చుండ్రుపోవటమే కాక జుట్టు పట్టులా మారుతుంది. దట్టంగా ఉంటుంది.
13. మెంతిగింజలను ఓ రోజంతా నీటిలో నానబెట్టండి. అలా నానబెట్టిన మెంతి గింజలను పేస్ట్‌లా చేయండి. తలమీద చర్మంపై బాగా మసాజ్ చేసుకోండి. మసాజ్ అయ్యాక ఓ అరగంట సేపు అలానే ఉంచి చక్కగా షవర్ బాత్ చేయండి
14. మందారగుజ్జుతో ఉసిరికపొడిగాని, బత్తాయి తొక్కల గుజ్జుని కలిపి వెంట్రుకలకి పట్టించండి. జుట్టు కుదుళ్లని తెరిపిస్తుంది. వెంట్రుకల ఎదుగుదల ప్రారంభమవుతుంది. అన్ని రకాల జుట్టు సమస్యలు పటాపంచలవుతాయి.
15. చందనం ఓ స్పూన్, తులసీ పుదీనా, అలోవెరా జెల్‌తో కలిపి మీ శరీరానికి రాసుకోండి. ఆరాక స్నానం చేస్తే మంచి ఛాయ మీసొంతమవుతుంది.
16. క్రమం తప్పకుండా తెల్లబడిన జుట్టుకు హెన్నాను వాడితే మిగిలిన జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.
17. పెరుగు, మజ్జిగను అధికంగా వాడటంతో పాటు కరివేపాకును ఆహారంలో అధికంగా ఉండేలా చూసుకోండి. కరివేపాకు, ఉసిరికాయలను మజ్జిగలో నూరిన ప్యాక్‌ను వాడటంతో పాటు మందారం ఆకులను నూరి తలస్నానానికి వాడటం మరీ మంచిది.
18. జుట్టు బాగా ఆరిన తర్వాత వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో చిక్కు తీసుకోవాలి. తలస్నానం చేసిన రోజులు తప్ప మిగిలిన రోజుల్లో గోరువెచ్చటి నూనెతో కుదుళ్లను తాకే విధంగా రాసి మునివేళ్లతో 15నిమిషాల పాటు మర్దనా చేస్తే జుట్టు పెరుగుతుంది.
19. జుట్టు చిక్కును కింది నుంచి పైకి తీయాలి. అనుదినం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, పెరుగు అధికంగా ఉండే విధంగా చూసుకుంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.
20. పొడిబారిన జుట్టుకోసం బాగా పండిన అరటిపండులో తేనె, నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరు నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే వెంట్రుకలు ఆరోగ్యంతో మెరుస్తాయి.
ధన్యవాదములు 🙏
Comments
Post a Comment